Home ప్రత్యేకం నాగార్జునకు ఊహించని షాక్.. విడుదలకు ముందే 'వైల్డ్‌ డాగ్‌' ఫుల్‌ మూవీ లీక్‌

నాగార్జునకు ఊహించని షాక్.. విడుదలకు ముందే ‘వైల్డ్‌ డాగ్‌’ ఫుల్‌ మూవీ లీక్‌

ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు కింగ్‌ నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ‘వైల్డ్‌ డాగ్’చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో సాగుతుంది. ఏప్రిల్‌ 2న విడుదలవుతున్న ఈ చిత్రానికి  సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మిగతా సినిమాల కంటే భిన్నంగా ప్రమోట్‌ చేస్తున్నారు మేకర్స్.

అయితే తాజాగా ఈ సినిమా లీక్‌ అయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది చిత్రబృందం. ఎవరో తమ యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేసి, వైల్డ్‌ డాగ్‌ ఫుల్‌ మూవీని అప్‌లోడ్‌ చేశారని ట్వీట్‌ చేసింది. దింతో అక్కడి యూట్యూబ్‌ లింకును ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. తీరా లింక్‌ ఓపెన్‌ అవగానే అలీ రెజా, సయామీ ఖేర్‌ ప్రత్యక్షమై “పైరసీ ఆపండి. వైల్డ్‌డాగ్‌ థియేటర్‌లోనే చూడండి” అని అంటున్నారు. అలా చిత్రబృందం అభిమానులను ఏప్రిల్‌ ఫూల్‌ చేశారు.

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు