ఈ ట్రైలర్ జస్ట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే.. లంచ్, డిన్నర్ ఏప్రిల్ 9న చేద్దాం.: దిల్ రాజు

0
89

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందోనన్న దానిపై హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ట్రైలర్‌లో దుమ్మురేపారు. కాగా, హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌.. దర్శకుడు  శ్రీరామ్ వేణు ఇతర సినిమా యూనిట్ పాల్గొన్నారు. అభిమానుల చేతుల మీదుగా ఈ థియేటర్‌లో వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ”వకీల్ సాబ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది కదా. ఈ అరుపులు లేక మూడేళ్లు అయ్యింది. ఈ ట్రైలర్ జస్ట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే. లంచ్, డిన్నర్ ఏప్రిల్ 9న చేద్దాం. ట్రైలర్ చూశారు.. మీ అభిమానులంతా హ్యాపీనా. ఇలాంటి సంతోషం కోసం, పవర్ స్టార్ ఇలా బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మూడేళ్లు మనమంతా వేచి చూశాం. ఆ వెయిటింగ్ ఇప్పటికి పూర్తయింది. ఏప్రిల్ 9న ఇదే థియేటర్ లో లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం..” అని దిల్ రాజు అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్, సాంగ్స్ మరింత హైప్ తీసుకుని వచ్చాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా కనిపిస్తున్నారు.