Home ప్రత్యేకం "వకీల్ సాబ్": పవన్ కళ్యాణ్ దెబ్బకు బద్దలైన ఇండస్ట్రీ రికార్డులు ఇవే!

“వకీల్ సాబ్”: పవన్ కళ్యాణ్ దెబ్బకు బద్దలైన ఇండస్ట్రీ రికార్డులు ఇవే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందుకే ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, ‘వకీల్ సాబ్’ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో లేని రికార్డులను ఈ ట్రైలర్‌ క్రియేట్‌ చేసింది. 24 గంటల్లో ఈ ట్రైలర్‌ క్రియేట్‌ చేసిన రికార్డులను చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.
సోమవారం సాయంత్రం 6గంటలకు ఈ ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లో ఇప్పటి వరకు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఏ సినిమా ట్రైలర్‌ సాధించని రికార్డులను వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ క్రియేట్‌ చేస్తూ వచ్చింది. గంట గంటకి మిలియన్ల వ్యూస్‌ పెరుగుతూనే వచ్చాయి. అలాగే లైక్స్‌ విషయంలో కూడా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఏ ట్రైలర్‌కు రాని లైక్స్‌ ఈ ట్రైలర్‌కు రావడం విశేషం. వ్యూస్‌, లైక్స్‌ పరంగా.. టాలీవుడ్‌లో ఇప్పుడు వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌దే అగ్రస్థానం. ఈ ట్రైలర్‌ 24 గంటల్లో.. 22.44 మిలియన్ల వ్యూస్‌ రాబట్టగా.. 1 మిలియన్‌ లైక్స్‌ (23 గంటల 39 నిమిషాల్లో) సాధించి.. పవన్‌ కల్యాణ్‌ స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్‌కి చూపించేలా చేసింది ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌.
ఇక వకీల్‌ సాబ్‌ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయినా పింక్‌ మూవీకి రీమేక్‌ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు