యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన తరవాత ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని వేచి చూస్తున్నారు. ఈ క్రమంల్ ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ వెల్లడించాయి. అయితే ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మరో పాన్ ఇండియా స్టార్ నే తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.
అయితే ఇండస్ట్రీలో ఈ సినిమాలో నటించే విలన్ గురించి ఒక ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమలో విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నిజంగానే నటిస్తున్నాడా లేడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ను ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.