Home క్రీడలు ‌ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లు వీరే! IPL 2021: Top 5 Batsmen With...

‌ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లు వీరే! IPL 2021: Top 5 Batsmen With Most Fours in IPL History

మరికొన్ని రోజుల్లో క్రికెట్‌ ప్రేమికులకు పండగే. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 9న ఐపీఎల్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా క్రికెట్‌ లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ  ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలో అత్యధిక ఫోర్లు కొట్టిన  ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం…

నెంబర్ 1: శిఖర్ ధావన్  { ఢిల్లీ క్యాపిటల్స్}
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్  తరఫున ఆడుతున్న టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో  175 మ్యాచుల్లో591 ఫోర్లు,108 సిక్సులు  బాది అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో  అగ్రస్థానంలో నిలిచాడు… ఇప్పటివరకు  ధావన్ ఈ లీగ్​లో 34. 41 సగటుతో 5191 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
నెంబర్ 2: డేవిడ్ వార్నర్ { సన్​రైజర్స్ హైదరాబాద్}
ఐపీఎల్ లో సన్​రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్​లో 142 మ్యాచుల్లో 510 ఫోర్లు  195 సిక్సులు,  బాదాడు. అలాగే 42.71 సగటుతో  5254 పరుగులూ సాధించాడు. ఇందులో 4 సెంచరీలు , 48 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి..
నెంబర్ 3 : విరాట్ కోహ్లీ   { రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు}
ఐపీఎల్​లో అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు..  కోహ్లీ ఈ మెగా టోర్నీలో మొత్తంగా 184 మ్యాచుల్లో 503 ఫోర్లు  201 సిక్సులు బాదాడు. అలాగే 38. 6 సగటుతో 5878 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి..
నెంబర్ 4 : సురేష్ రైనా  { చెన్నై సూపర్ కింగ్స్}
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కీలక ఆటగాడిగా ఉన్న సురేష్ రైనా ఈ  టోర్నీ లో మొత్తం  189మ్యాచుల్లో 493 ఫోర్లు  194 సిక్సులు బాదాడు. 503 ఫోర్లూ సాధించాడు. మొత్తంగా ఈ లీగ్​లో 33. 34 సగటుతో రైనా  5368 పరుగులు చేశాడు. ఇందులో ఒక  సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
నెంబర్ 5 :  గౌతమ్ గంభీర్ { కోల్​కతా నైట్​రైడర్స్}
ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ జట్టును 2012, 2014 సీజన్ లో  విజేతగా నిలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఈ మెగాటోర్నీకి అతడు దూరమైనా కూడా  అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో ఐదో స్థానంలో ఇప్పటికీ కొనసాగుతున్నాడు. గంభీర్ ఇప్పటివరకూ 152 ఇన్నింగ్స్​ల్లో 491 ఫోర్లు 59 సిక్సులు బాదాడు. అలాగే 4217 పరుగులు సాధించాడు. ఇందులో 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

 

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు