Home ప్రత్యేకం గంటకు రూ.2,896 కోట్ల నష్టం! ప్రపంచ వ్యాపారాన్ని ముంచేసిన `ఎవర్‌ గివెన్‌` నౌక

గంటకు రూ.2,896 కోట్ల నష్టం! ప్రపంచ వ్యాపారాన్ని ముంచేసిన `ఎవర్‌ గివెన్‌` నౌక

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్‌ కాలువ ఆసియాను, ఐరోపాను కలుపుతూ మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు ఉంటుంది. ఈ కృత్రిమ జల మార్గం ద్వారా  ప్రతి రోజు కొన్ని వేల టన్నుల సరకు రవాణా జరుగుతుంటుంది. 193 కి.మి. వెడల్పుతో, 78 అడుగుల లోతుతో నిర్మించిన ఈ కాలువ ద్వారా ఎక్క్కువగా సహజవాయువు, పెట్రోల్, ధాన్యాలు, సరుకులు,నిత్యావసర వస్తువులు మొదలైనవి ఎక్కువగా రవాణా అవుతుంటాయి. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద కంటెయినర్‌ షిప్‌లలో ఒకటైన `ఎవర్‌ గివెన్‌` అనే భారీ నౌక ఒకటి మర్చి 23న మంగళవారం ఉదయం ఈ కాలువకు అడ్డంగా ఇరుక్కుపోయింది..

భారీ సరకుతో చైనా నుంచి నెదర్లాండ్స్‌ వెళ్తున్న  `ఎవర్‌ గివెన్‌` నౌక భారీ గాలుల కారణంగా మంగళవారం ఉదయం కెనాల్‌పై అడ్డంగా తిరిగి అక్కడే  ఉండిపోయింది. 2 లక్షల మెట్రిక్‌ టన్నుల బరువు ఉండే ఈ నౌకని ముందుకి కదల్చడం సాంకేతిక నిపుణులకు సవాల్‌గా మారింది. దీంతో వెనుక ముందు ఉన్న ఓడలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ముఖ్య  పాత్ర పోషించే సూయజ్‌ కాలువలో ఈ భారీ నౌక చిక్కుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 200కిపైగా సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో గంటకి దాదాపు 2896 కోట్ల వ్యాపారం పై ప్రభావం పడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు..

ఇక `ఎవర్‌ గివెన్‌` నౌక విషయానికొస్తే.. ఇది ఎత్తులో ఈఫిల్‌ టవర్‌ కంటే పొడవైనది. పరిమాణంలో మూడు ఫుట్‌బాల్‌ గ్రౌండ్ల కంటే పెద్దది. ఈ భారీ నౌకలో మొత్తం 12 అంతస్తులు ఉన్నాయి. ఈ నౌక సుమారుగా 1300 అడుగుల పొడవు, 193 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇదిలాఉంటే .. `ఎవర్‌ గివెన్‌` నౌకలో భారత్ కు చెందిన 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారని.. ప్రస్తుతానికి వీరంతా క్షేమంగా ఉన్నారని‘ఎవర్‌ గివెన్‌’ నౌక యాజమాన్యం ప్రకటించింది..

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు