Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. ఏమందంటే?

‘వకీల్ సాబ్’ పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. ఏమందంటే?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌సాబ్‌’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఇటీవల వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

తాజాగా ఈ వీడియోపై స్పందించిన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు రేణు. ఇప్పటివరకూ చూడని పవర్ స్టార్‌ స్క్రీన్‌పై కనిపించాడని అనేసింది. అంతేకాదు.. ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ నచ్చిందని, అమ్మాయి తరపున వాళ్ళ కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన అదరగొట్టేశాడని పేర్కొంది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుందని.. మొదటి నుంచి చివరి వరకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఆసక్తికరంగా సాగిందని ప్రశంసలు కురిపించారు రేణు.
కాగా, కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ నుంచి రేణు విడాకులు తీసుకున్నా మెగా అభిమానులు మాత్రం ఆమెను ఇంకా వదినలానే చూస్తు్న్నారు. ఆమె పిల్లలను తమ హీరో పిల్లలని అభిమానిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు