Home ప్రత్యేకం రామ్ చరణ్-శంకర్ సినిమా కథ ఇదేనా?

రామ్ చరణ్-శంకర్ సినిమా కథ ఇదేనా?

ప్రస్తుతం ఇటు ‘ఆచార్య’, అటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు రామ్‌చరణ్‌. ‘ఆచార్య’ షూటింగ్‌ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా ముగింపు దశకు చేరుకునేసరికి శంకర్‌ కాంబినేషన్‌లో రామ్‌చరణ్‌ చేయనున్న సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుందని తెలిసింది. ప్రస్తుతం శంకర్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ మీద ఉన్నారు. జూన్‌లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పవర్‌ఫుల్‌ ఎమోషన్స్‌ ప్రధానంగా ఈ సినిమాను శంకర్‌ తెరకెక్కించనున్నారని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పొలిటికల్‌ డ్రామాగా  తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఇందులో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఓ సిన్సియర్ ఐఏఎస్‌ అధికారి సీఎం అయితే, సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చాడన్న ఇతివృత్తంతో కథ సాగుతుందట. మరి ముఖ్యమంత్రి పాత్రలో మెగా పవర్ స్టార్ ను.. ఈ మెగా డైరెక్టర్‌ ఎలా చూపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు