రామ్‌చరణ్‌ బర్త్‌డే కామన్‌ డీపీ వైరల్‌..!

0
173
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కామన్‌ డీపీ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. మార్చి 27న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మూడు రోజులు ముందుగానే డీపీని విడుదల చేశారు. అభిమనులందరు ఈ ఫొటోను తమ సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఈ డీపీ వైరల్‌గా మారింది. చెర్రీని మెగాపవర్ స్టార్ అని పిలుచుకుంటారు కాబట్టి.. బ్యాక్ గ్రౌండ్ లో బిగ్ స్టార్ ఒకటి సెట్ చేశారు. కామన్‌ డీపీలో రామ్ చరణ్ ఎవడు సినిమాలో ధరించిన డ్రెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్లూ కలర్ ఓపెన్ షర్ట్ తో జేబులో చేతులు పెట్టుకొని చెర్రీ ఎవడు సినిమా బీచ్ సాంగ్ ఫొటోతో డిజైన్ చేశారు అభిమానులు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
మరోవైపు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు కొత్త పోస్టర్‌ రూపంలో గిఫ్ట్‌ ఇవ్వనున్నారు చరణ్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. చరణ్‌ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను బర్త్‌ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. మరోవైపు చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో చరణ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే శంకర్‌ డైరెక్షన్‌లో చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ రూపొందనుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా బర్త్‌ డేకి వచ్చే అవకాశం ఉంది.