Home ప్రత్యేకం "అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ.." అంటూ చెర్రీకి చిరు బర్త్‌డే విషెస్.. వీడియో వైరల్‌

“అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ..” అంటూ చెర్రీకి చిరు బర్త్‌డే విషెస్.. వీడియో వైరల్‌

మార్చి 27.. మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్ డే.. తాము ఎంతగానే ఆరాధించే కథానాయకుడి పుట్టినరోజును అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల ముందు నుంచే వేడుకలు మెదలు పెట్టేశారు. ఇప్పటికే  సోషల్‌ మీడియాలో హ్యపీ బర్త్‌డే రామ్‌ చరణ్‌ అంటూ దుమ్మురేపుతున్నారు. ఇటు ట్విటర్‌లోనూ రామ్‌చరణ్‌ పేరుతో ఓ హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. కేకులు, కటౌట్లకు పాలాభిషేకాలతో పుట్టినరోజు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక అభిమానులే కాకుండా.. సెలబ్రిటీలు, కుటుంబసభ్యులు కూడా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు.. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను వదిలి.. రామ్‌ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
“అప్పుడు అంటూ.. రామ్ చరణ్ బాల్యంలో గొడుగు పట్టుకుని ఉన్న ఫొటోని, ఇప్పుడు అంటూ.. మెగా పవర్ స్టార్ పెద్దవాడయిన తర్వాత చిరుకు గొడుకు పడుతున్న ఫొటోని, ఎల్లప్పుడూ.. అంటూ ‘ఆచార్య’ సెట్స్‌లో మెగాస్టార్ కు గొడుకు పడుతున్న ఫొటోని చూపిస్తూ.. వెనుక బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘డాడీ’ సినిమాలోని గుమ్మాడి పాట మ్యూజిక్‌ వినిపిస్తూ.. సాగిన ఈ వీడియో అద్భుతంగా ఉంది. ‘హి ఈజ్‌ కేరింగ్‌ సన్‌..’ అని తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్‌.. గాడ్‌ బ్లెస్‌.. అమ్మ అండ్‌ డాడీ’ అని రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు చిరంజీవి దంపతులు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు