రామ్‌చరణ్‌ బర్త్‌డే.. ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ట్రీట్

0
124

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మార్చి 27న 36వ వ‌సంతంలోకి అడుగుపెట్టనున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని ఫ్యాన్స్ ఇప్పటి నుండే సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇక మార్చి 26 సాయంత్రం 4.32ని.ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌గా భారీ ఎత్తున వేడుక జ‌రిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక‌కు మెగా అభిమానుల‌తో పాటు ప‌లువురు సినీ హీరోలు కూడా హాజ‌రు కానున్నారని తెలుస్తోంది. ఇక చరణ్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. చరణ్‌ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను బర్త్‌ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది..
మరోవైపు ఆచార్య చిత్రయూనిట్  కూడా రామ్‌చరణ్‌సిద్ధ పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్లు సమాచారం. ఒకేవేళ ఇదే గనుక నిజమైతే ఒక్కరోజులోనే మెగా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ట్రీట్ ఉంటుందని చెప్పొచ్చు.  అలాగే శంకర్‌ డైరెక్షన్‌లో చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా బర్త్‌ డేకి వచ్చే అవకాశం ఉంది.