Home ప్రత్యేకం 'ఆర్ఆర్ఆర్' సెట్స్‌లో రామ్ చ‌రణ్ బ‌ర్త్ డే సెలెబ్రేషన్స్

‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో రామ్ చ‌రణ్ బ‌ర్త్ డే సెలెబ్రేషన్స్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నేటితో 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. మార్చి 27న చెర్రి బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమనుల నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్ లో రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. దర్శకధీరుడు రాజ‌మౌళి, చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య‌తో పాటు ప‌లువురు చిత్రయూనిట్ స‌భ్యుల స‌మ‌క్షంలో రామ్ చ‌ర‌ణ్ కేక్ క‌ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ సినిమా నుంచి చరణ్ పోషిస్తున్న ‘సిద్ద’ లుక్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. చరణ్ బర్త్ డే పోస్టర్‌గా రిలీజ్ చేసిన ఈ లేటెస్ట్ లుక్‌లో ‘సిద్ద’ ‘ఆచార్య’తో కలిసి ఉండగా మెగా అభిమానుల్లో..సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేదిగా ఉండటం విశేషం. ఇక అంతకుముందు రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శిల్పకళావేదికలో మెగా సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు హాజరయ్యారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు