Home సినిమాలు ప్రభాస్ ‘ఆదిపురుష్’ క్రేజీ అప్‌డేట్‌: సగానికి పైగా షూటింగ్ అక్కడే..

ప్రభాస్ ‘ఆదిపురుష్’ క్రేజీ అప్‌డేట్‌: సగానికి పైగా షూటింగ్ అక్కడే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా కనిపించనున్నారు. భారీ తారాగణంతో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్‌గా ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ పై షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఫైట్స్ నుండి మొదలుకుని పాటల వరకు అన్ని కూడా విజువల్ వండర్ గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు ఓం రౌత్ ప్రస్తుతం ప్రభాస్, కృతి సనన్ ల కాంబోలో పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ నటిస్తున్న సినిమా షూటింగ్ ను ఈ ఏడాది ద్వితీయార్ధం వరకు పూర్తి చెయ్యాలనే పట్టుదలతో దర్శకుడు ఓం రౌత్ ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు