Home సినిమాలు శరవేగంగా పవన్ -రానా మూవీ షూటింగ్: స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్.. ఫోటో...

శరవేగంగా పవన్ -రానా మూవీ షూటింగ్: స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్.. ఫోటో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఇటీవలే తన ‘వకీల్ సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఫినిష్ కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టాకీ పార్ట్ మే నెలాఖరుకు పూర్తి కానుంది. రాబోయే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్రయూనిట్ వెల్లడించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఉన్న ఓ ఫోటో బయటకు వచ్చింది. దీనిని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించనున్నారు. మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. అక్కడ బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవన్‌, రానా పోషిస్తున్నారు. ఇందులో కథానాయికలుగా నిత్యా మీనన్, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికైనట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు