ఇటీవల ‘చెక్’ సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నితిన్ మార్చి 26న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రంగ్ దే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. ఇద్దరి మధ్య గిల్లిగజ్జాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మూడోరోజు కూడా చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ విశేష స్పందన తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా 23.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగ్ దే మూవీ ఈ మూడు రోజుల్లో కలిపి 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వచ్చే వారం కూడా ఇదే జోరు కొనసాగిస్తే సునాయాసంగా బ్రేక్ ఈవెన్ చెరుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇక ‘రంగ్ దే’ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. మూడో రోజు సెలవుదినం ఆదివారం కావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడో రోజైన ఆదివారం నాడు 2.88 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘రంగ్ దే’ మూవీ ఏరియాల వారీగా కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే..