Home సినిమాలు ఆసక్తికర ప్రీ-లుక్ తో నితిన్‌ 30వ సినిమా టైటిల్ - ఫస్ట్ లుక్ అనౌన్సమెంట్..

ఆసక్తికర ప్రీ-లుక్ తో నితిన్‌ 30వ సినిమా టైటిల్ – ఫస్ట్ లుక్ అనౌన్సమెంట్..

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్నా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

కాగా, నితిన్ ఇందులో పియానో ప్లేయర్ గా కనిపించనున్నాడు. తాజాగా ‘రంగ్ దే’ సక్సెస్ జోష్ లో ఉన్న నితిన్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే నితిన్ 30వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు మంగళవారం (మార్చి 30) ఉదయం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా వదిలిన నితిన్ ప్రీ లుక్ ఆసక్తికరంగా ఉంది. పియానో ప్లే చేస్తున్న నితిన్ వెనక్కితిరిగి ఉండగా..ఆయన పక్కనే ఓ పిల్లి పాలు తాగుతూ కనిపిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్‌

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు