Home సినిమాలు నాగ్ "వైల్డ్‌ డాగ్‌" ప్రివ్యూ: విజయ్‌వర్మ దుమ్మురేపాడంటున్న టాలీవుడ్ దర్శకులు

నాగ్ “వైల్డ్‌ డాగ్‌” ప్రివ్యూ: విజయ్‌వర్మ దుమ్మురేపాడంటున్న టాలీవుడ్ దర్శకులు

ప్రజల జీవితాల్లో అలజడి సృష్టించిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌  ఏజెన్సీ) ఏసీపీ విజయ్‌వర్మ ఓ ప్లాన్‌ వేశాడు. విజయ్‌ వ్యూహం ఎలా ఉంటుందో ‘వైల్డ్‌ డాగ్‌’లో చూడొచ్చు. నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మేక‌ర్స్ ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు స్పెష‌ల్ ప్రివ్యూను ఏర్పాటు చేశారు.

ఈ ప్రివ్యూ అనంత‌రం ఘాజి దర్శకుడు సంక‌ల్ప్ రెడ్డి మాట్లాడుతూ.. సీట్ నుంచి కదలనివ్వని త్రిల్లర్ మూవీ ఇది. తెలుగు సినిమాలో ర‌త్నంలాంటిది. మ‌నంద‌రం గ‌ర్వించ‌ద‌గ్గ‌ సినిమా అవుతుంది అని అన్నారు. కాగా, క్షణం, కృష్ణా అండ్‌ హిజ్‌ లీలా డైరెక్టర్‌ రవికాంత్‌ పెరు మాట్లాడుతూ..ఊహించని కథనం, యాక్షన్‌ సీక్వెన్స్‌ సీటుకు అతుక్కుపోయేలా చేస్తాయి. ఈ సినిమాను ఎంతో అంకితభావంతో చేశారు అని అన్నారు.

ఆ తర్వాత ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే మాట్లాడుతూ.. ‘‘వైల్డ్‌డాగ్‌’ కథ నాకు నచ్చడానికి కారణం ఏసీపీ విజయ్‌వర్మ క్యారెక్టర్‌. విజయ్‌ వర్మ మంచి తండ్రి, మంచి మానవతావాది, మంచి భర్త, మంచి టీమ్‌ లీడర్‌. ప్రేమించిన దానికోసం ఏమైనా చేస్తాడు టాలీవుడ్‌లో ఇలాంటి సినిమా వస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది అని అన్నారు..

 

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు