Home సినిమాలు నాగార్జున వైల్డ్‌డాగ్‌' సెన్సార్‌ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..

నాగార్జున వైల్డ్‌డాగ్‌’ సెన్సార్‌ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘వైల్డ్ డాగ్’ మూవీ ఏప్రిల్‌ 2న విడుదల కాబోతోంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహించారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. దియా మీర్జా హీరోయిన్‌గా నటించగా.. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించారు.

కాగా, ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. హైదరాబాద్‌ గోకుల్‌ చాట్‌ సహా దేశంలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ల కేసును ఎన్‌ఐఏ టీమ్‌ను ఎలా చేధించిందనే కథాంశంతో ‘వైల్డ్‌డాగ్‌’ సినిమా తెరకెక్కింది. సినిమా హైదరాబాద్‌ సహా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఈ సినిమా షూటింగ్‌  జరుపుకుంది. ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా యాక్షన్ రోల్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ సినిమాకి అన్నీ కలిసి వస్తున్నాయి. ఓటీటీలో ఏనాడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రమోషన్ కూడా బాగుంది. అంతేకాకుండా.. ఏప్రిల్ 2న మొత్తం మూడు చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. ‘వైల్డ్ డాగ్’ తోపాటు గోపీచంద్ ‘సీటీ మార్’ తమిళ్ హీరో కార్తీ డబ్బింగ్ మూవీ ‘సుల్తాన్’ లైన్లో ఉన్నాయి. అయితే.. ఊహించని విధంగా గోపీచంద్ ‘సీటీమార్’ రిలీజ్ వాయిదా పడింది. దీంతో.. బరిలో రెండే చిత్రాలు నిలిచాయి. అందులోనూ కార్తీ సినిమా డబ్బింగ్ కావడంతో తెలుగు ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ నాగ్ సినిమాకే ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు