భారత్ వేదికగా జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీ 14వ ఎడిషన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరుగనుంది. ఈ టోర్నమెంట్ 6 వేర్వేరు వేదికలలో జరుగనుండగా, ప్రతి జట్టు 4 వేదికలలో ఆడతాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
నెంబర్ 1: క్రిస్ గేల్ { పంజాబ్ కింగ్స్}
ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో 132 మ్యాచుల్లో 349 సిక్సులు, 384 ఫోర్లు బాది అగ్రస్థానంలో నిలిచాడు… ఇప్పటివరకు గేల్ ఈ లీగ్లో 41. 3 సగటుతో 4772 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
నెంబర్ 2: ఏబీ డివిలియర్స్. { రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు}
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇప్పటివరకు ఐపీఎల్లో 169 మ్యాచుల్లో 235 సిక్సులు, 390 ఫోర్లు బాదాడు. అలాగే 40.41 సగటుతో 4349 పరుగులూ సాధించాడు. ఇందులో 3 సెంచరీలు , 38 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి..
నెంబర్ 3 : మహేంద్రసింగ్ ధోనీ { చెన్నై సూపర్ కింగ్స్}
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని ఈ మెగా టోర్నీలో మొత్తంగా 204 మ్యాచుల్లో 216 సిక్సులు 313 ఫోర్లు బాదాడు. అలాగే 40.99 సగటుతో 4632 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి..
నెంబర్ 4 : రోహిత్ శర్మ { ముంబయి ఇండియన్స్}
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సారథిగా ఉన్న రోహిత్ శర్మ ఆ జట్టును ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఇక రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలోమొత్తం 200 మ్యాచుల్లో213 సిక్సులు, 458 ఫోర్లు బాది అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే 31.31సగటుతో 5230 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ , 39 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి..
నెంబర్ 5 : విరాట్ కోహ్లీ { రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు}
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 192 మ్యాచుల్లో 201 సిక్సులు,503 ఫోర్లు బాదాడు. 503 ఫోర్లూ సాధించాడు. మొత్తంగా ఈ లీగ్లో 38. 6 సగటుతో కోహ్లీ 5878 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.