Home సినిమాలు నాని 'టక్ జగదీష్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!

నాని ‘టక్ జగదీష్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్‌ జగదీశ్‌’.. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. షైన్‌ పిక్చర్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 23న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.

ఇదిలాఉంటే.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే నాని గత సినిమాలు వి, గ్యాంగ్ లీడర్ బాక్సఫీసు వద్ద నిరాశపరిచాయి. దాంతో ఈయన ఆశలన్ని టక్ జగదీష్ సినిమాపైనే ఉన్నాయి. అయితే నాని ఫ్లాపులు ఈ సినిమా బిజినెస్ పై ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదు.

ఈ సినిమా కోసం భారీ మొత్తం చెల్లిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఆంధ్ర, నైజాం, సీడెడ్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల ప్రాంతాల్లో ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు బయ్యర్లు. శివ నిర్వాణ ట్రాక్ రికార్డ్.. నాని ఇమేజ్ రెండు కలిపి టక్ జగదీష్ సినిమాను 35 కోట్ల బిజినెస్ వైపు పరుగులు పెట్టేలా చేస్తుంది. కాగా, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా చేశారు శివ నిర్వాణ. నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు.

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు