Home ప్రత్యేకం మెగాస్టార్ అంటే అంతేగా మరి.. చిరు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌కు షాకైన నాగార్జున

మెగాస్టార్ అంటే అంతేగా మరి.. చిరు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌కు షాకైన నాగార్జున

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 2)న విడుదలైంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్‌ నాగ్‌  ఏసీపీ విజయ్‌ వర్మగా నటించాడు. ఇక ఈ సినిమా కోసం నాగ్‌ గత చిత్రాలకు భిన్నంగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ‘వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్’’ పేరుతో సినీ ప్రముఖులకు పుష్‌ అప్‌ చాలెంజ్‌ విసిరాడు. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవిని సైతం భాగం చేశారు నాగార్జున.

నిజానికి చిరు,నాగ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.. ఒకరి సినిమా ప్రమోషన్స్ ఒకరు పాల్గొంటూ ఉంటారు. తాజాగా వైల్డ్ డాగ్ ప్రమోషన్స్‌లో భాగం అయ్యారు చిరంజీవి. ఇందుకోసం తన చేతి వంటను రుచి చూపించి మరీ వైల్డ్ డాగ్ ప్రమోషన్స్‌ నిర్వహించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు నాగార్జున. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ విడుదల కానుండడంతో కొంచెం ఒత్తిడిలో ఉన్నానని, అయితే ఆ ఒత్తిడిని దూరం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వంట చేసి మరీ రుచికరమైన విందు భోజనం వడ్డించారని నాగార్జున తెలిపారు. అయితే చిరంజీవి స్వయంగా వంట చేస్తుండగా.. ఫొటో తీసింది ఆయన సతీమణి సురేఖ అని తెలియజేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపి ఆ ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు నాగార్జున.

 

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు