Home సినిమాలు #BB3 బాలయ్య, బోయ‌పాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌

#BB3 బాలయ్య, బోయ‌పాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌

బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా స్పెషల్‌ గ్లిమ్స్‌ చూసి అభిమానులు ఎంతో ఆనందించారు.సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అయితే తాజాగా చిత్రబృందం ఓ ఆసక్తికరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.కాగా,బోయపాటి శ్రీను- బాలకృష్ణ జోడి గురించి చెప్పాల్సిందేముంటుంది. వీళ్లిద్దరూ కలిశారంటే  రికార్డుల మోత అనాల్సిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇవి రెండూ బాలకృష్ణలోని నట విశ్వరూపాన్ని చూపించాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం  తెరకెక్కుతోంది. ఈసారీ యాక్షన్‌  నేపథ్యమే అయినా వైవిధ్యంగా ఉండేందుకు బాలయ్యను అఘోరా పాత్రలో చూపించబోతున్నారు బోయపాటి. దాంతో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్‌  పెరిగింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు