Home సినిమాలు నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్... బాలయ్య కోసం రంగంలోకి ఎన్టీఆర్!

నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్… బాలయ్య కోసం రంగంలోకి ఎన్టీఆర్!

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూడో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమా టైటిల్ ను మహా శివరాత్రి సందర్భంగా ప్రకటిస్తారనే ప్రచారం సాగింది. కానీ.. శివరాత్రి దాటిపోయి చాలా రోజులు అయినప్పటికీ.. ఇంకా టైటిల్ మాత్రం ప్రకటించలేదు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఉగాదికి ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు.. ఈ టైటిల్ ను యంగ్ టైగర్  ఎన్టీఆర్ విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది. టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ తో తో విడుదల చేయించాలని దర్శకుడు బోయపాటి ప్రయత్నిస్తున్నారట. యంగ్ టైగర్ ద్వారా సోషల్ మీడియాలో ఈ టైటిల్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

చిరు-బాబీ మూవీ క్రేజీ అప్‌డేట్.. సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందట!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో లూసిఫ‌ర్ రీమేక్‌, మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో వేదాల‌మ్ రీమేక్ ఉన్నాయి. మ‌రోవైపు బాబీ...

‘వకీల్ సాబ్’ తొలి వారం వసూళ్లు.. బాక్సఫీసు వద్ద పవర్ స్టార్ ప్రభంజనం!

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర...

ప్రభాస్ ‘సలార్‌’ మూవీ నుండి క్రేజీ అప్‌ డేట్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్‌’లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ...

మహేష్-త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్షేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా...

ఇటీవలి వ్యాఖ్యలు