Home సినిమాలు "18 ఏళ్లు... 20 సినిమాలు".. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్

“18 ఏళ్లు… 20 సినిమాలు”.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్

గతేడాది ఆరంభంలో ‘అల..వైకుంఠపురములో…’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ (బన్ని). ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు బన్ని. ఇది తన కెరీర్‌లో 20వ చిత్రం. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో బన్నీ మాస్‌, రఫ్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. అంతేకాకుండా ‘పుష్ప’ కోసం ఆయన చిత్తూరు మాండలికాన్ని నేర్చుకున్నారు.

ఇదిలాఉంటే.. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్‌. ఆ తర్వాత ‘ఆర్య’, ‘దేశముదురు’, ‘పరుగు’, జులాయి, రేసుగుర్రం, సరైనోడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో ఇండస్ట్రీలో తనదైన ప్రతిభను చాటుకున్నారు. అయితే నేటికీ ‘గంగోత్రి’ సినిమా విడుదలై 18 సంత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ తనను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. “నా తొలి సినిమా విడుదలై నేటికి 18 ఏళ్లవుతుంది. నా 18 ఏళ్ల ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నా హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఇన్నేళ్లు నాపై ప్రేమను కురిపించినందుకు నేను అదృష్టవంతుడిని. మీ ఆశీర్వాదాలు అందించింనందుకు థాంక్స్” అని అల్లు అర్జున్‌ ట్వీట్ చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు