Home సినిమాలు స్టైలిష్ స్టార్ ఫాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. "పుష్ప" నుండి బన్నీ బర్త్ డే...

స్టైలిష్ స్టార్ ఫాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. “పుష్ప” నుండి బన్నీ బర్త్ డే గిఫ్ట్ రెడీ

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబోలో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. దీనిలో రష్మిక మందనా కథానాయిక. ఇదిలాఉంటే.. అల్లు అర్జున్ అభిమానులకు ఊరటనిచ్చేందుకు గతేడాది బన్నీ పుట్టినరోజు సందర్బంగా పుష్ప సినిమా పోస్టర్ తో పాటు పుష్ప టైటిల్ కూడా ప్రకటించారు మేకర్స్. మరి ఈ ఏడాది ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వాస్తవానికి ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఎన్నో ఊహగానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి. అందులో బన్నీ పుట్టినరోజుకు పుష్ప నుండి ఖచ్చితంగా మంచి సర్ప్రైజ్ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. గతేడాది పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈసారి బన్నీ లుక్ టీజర్ వదిలితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఎలాంటి ఎలాంటి సర్ప్రైజ్ ఉంటుందో తెలియదు కానీ పక్కా డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఏదో భారీ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.‘అల వైకుంఠపురంలో’ సినిమాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు