‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపిన మెగాస్టార్

0
125
తండ్రీ తనయులు చిరంజీవి, రామ్‌చరణ్‌ కథా  నాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌ రెడ్డితో కలిసి రామ్‌చరణ్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. దీని చిత్రీకరణ తుదిదశకు చేరింది. కాగా, ధర్మస్థలికి ఉత్సవ శోభ వచ్చిందంటూ మరో కబురు వినిపించింది ‘ఆచార్య’ బృందం. ఈ సినిమాలో ధర్మస్థలి పేరుతో ఓ దేవాలయ సముదాయం కనిపించనుంది. ఆ నేపథ్యంలో సాగే ‘లాహే లాహే… ’ అనే ఓ హుషారైన గీతాన్ని మార్చి 31న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.
అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 15 సెకన్ల నిడివి గల  ‘లాహే లాహే… ’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో చిరంజీవి కనిపించిన విధానం చూసి వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. 15 సెకన్ల వీడియో ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కు కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ వస్తుందా అని వేచి చూసేలా చేస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌, టీజర్ కంటే కూడా ఇప్పుడు విడుదలైన లాహే లాహే సాంగ్ ప్రోమో లో చిరంజీవి కొత్తగా కనిపిస్తున్నారు.
కాగా, చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆచార్యగా చిరంజీవి, సిద్ధ పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. మే 13న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్‌ కానుంది.