Home క్రీడలు 87ఏళ్ల తర్వాత తొలిసారి: రంజీకి బదులు విజయ్‌ హజారె ట్రోఫీ

87ఏళ్ల తర్వాత తొలిసారి: రంజీకి బదులు విజయ్‌ హజారె ట్రోఫీ

కరోనా మహమ్మారి కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ-2020-21 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.అయితే రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్‌ హజారె ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా,రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం 87 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు లేఖ రాశారు. ఈ కరోనా మహమ్మారి అందరినీ పరీక్షించిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర సంఘాల మద్దతుతోనే పురుషుల దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఏప్రిల్, మే నెలలో ఐపీఎల్‌ 2021వ సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఫిబ్రవరిలోనే విజయ్‌ హజారె ట్రోఫీ జరిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించి త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. ఈ ట్రోఫీ కోసం ఆరు బయో బుడగలను ఏర్పాటు చేస్తుండగా ఆటగాళ్లంతా మరో వారం రోజుల్లో అందులోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు