Home సినిమాలు 50 కోట్ల క్లబ్ లో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'..జోరు మీదున్న మెగా మేనల్లుడు..

50 కోట్ల క్లబ్ లో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’..జోరు మీదున్న మెగా మేనల్లుడు..

మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి హీరోహీరోయిన్లుగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లోనే మంచి కలెక్షన్స్ సాధించి పలువురు స్టార్ హీరోల కలెక్షన్ల రికార్డులను కూడా బద్దలుగొట్టింది. ప్రస్తుతం వంద కోట్ల రూపాయల కలెక్షన్ల దిశగా సాగుతోంది.

ఈ క్రమంలోనే విడుదలైన 17వ రోజు కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. నితిన్ లాంటి క్రేజీ హీరో నటించిన చెక్ సినిమాకు చెక్ పెడుతూ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది ఉప్పెన. తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. తొలి సినిమాతోనే 50 కోట్ల షేర్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. నాని, సాయి ధరం తేజ్, రామ్, నాగచైతన్య ఇలా ఎంతో మంది యంగ్ హీరోలు ఇప్పటికి 50 కోట్ల షేర్ అందుకోలేకపోయారు. అలాంటిది తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ హాఫ్ సెంచరీ కొట్టాడు.

హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి నటన, విజయ్ సేతుపతి విలనిజం, రియాలిటీకి దగ్గరగా ఉన్న కథ అన్నీ ఈ ‘ఉప్పెన’ కలెక్షన్ల ప్రవాహంలో కీలక భూమిక పోషించాయి. ఇప్పటికే భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు