Home సినిమాలు 40 మంది అమెరికన్ యోధులతో 'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ ఫైట్‌.. ఇక రచ్చ రచ్చే

40 మంది అమెరికన్ యోధులతో ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్‌.. ఇక రచ్చ రచ్చే

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు’, ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం’ వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

అయితే, ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్  సారథ్యంలో యాక్ష‌న్ సీన్స్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుండ‌గా, క్లైమాక్స్ లో భారీ ఫైట్ కోసం అమెరికా నుండి 40 మంది యోధులు భారత్ కు వ‌స్తున్నారు. 40 మందితో రాజమౌళి చిత్రీక‌రించే క్లైమాక్స్ సీన్ ప్రేక్ష‌కుల స‌రికొత్త వినోదాన్ని పంచుతుంద‌ని అంటున్నారు. కాగా.. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ ప్రాజెక్టును రూ.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు