Home సినిమాలు 21 ఏళ్ల తర్వాత ‘చిత్రం’ సీక్వెల్.. 45 మంది కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్న‌ తేజ

21 ఏళ్ల తర్వాత ‘చిత్రం’ సీక్వెల్.. 45 మంది కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్న‌ తేజ

టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన సినిమాల్లో  ‘చిత్రం’ ఒకటి. తేజని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ, ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ఉదయకిరణ్‌, రీమాసేన్‌లకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు తేజ. తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 22న)  తేజ ఈ సినిమాను ప్రకటించారు. ‘చిత్రం 1.1’ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం నటీనటులందరినీ కొత్తవాళ్లను తీసుకున్నారు. మొత్తం 45 మంది కొత్త నటీనటులను తేజ ఈ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నారు. అయితే, కేవలం నటీనటులు మాత్రమే కొత్తవాళ్లు.. టెక్నికల్ టీమ్ మాత్రం ఇంచుమించుగా పాతదే ఉండనుంది.

ఇక ‘చిత్రం’ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మళ్లీ చాలా కాలం తరవాత తేజతో జతకట్టారు. కాకపోతే, ‘చిత్రం’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి పనిచేయడం లేదు. ఆయన స్థానంలో సమీర్ రెడ్డిని సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. అలాగే, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈ సినిమాను తేజ స్వయంగా నిర్మిస్తున్నారు. ఎస్.స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి. ఇక యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా వ‌చ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు