Home ప్రత్యేకం 2022 వేసవి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్..?

2022 వేసవి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్..?

ఇద్దరు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు ఓ మంచి పని కోసం ఏకమైతే ఎలా ఉంటుంది? అన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఇందులో కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీతో ఆలియా భట్‌ జోడీ కడుతుండగా తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు .

ఇదిలాఉంటే.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా షూటింగ్ మరోసారి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే విడుదల కావాల్సి సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు చిన్న సినిమాలతో పాటుగా, పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా వున్నాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ 2022 వేసవి కానుకగా విడుదల కానున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు