Home ప్రత్యేకం 100 కోట్ల క్లబ్‌లో ‘వకీల్ సాబ్’..బాక్సఫీసు వద్ద పవన్ కళ్యాణ్ విధ్వంసం!

100 కోట్ల క్లబ్‌లో ‘వకీల్ సాబ్’..బాక్సఫీసు వద్ద పవన్ కళ్యాణ్ విధ్వంసం!

అంతా ఊహించినట్టుగానే కరోనా మహమ్మరిని కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ధీటుగా ఏసుర్కొంది. బాక్సఫీసు వద్ద పెను విధ్వంసం సృష్టిస్తున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. కరోనా టైం లో కూడా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లను తీసుకొచ్చింది వకీల్ సాబ్ సినిమా. అయితే ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను చిత్రయూనిట్ అధికారికంగా ఇంకా ప్రకటించికపోయినా.. ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల వసూళ్లను వసూలు చేసిందని.. డిస్ట్రిబ్యూటర్స్ వాటా దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
బాక్సఫీసు వద్ద దూసుకుపోతున్న ‘వకీల్ సాబ్’ సోమవారం నాటికి రూ .100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిందని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తాజాగా  వెల్లడించారు. కాగా, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ ‘వకీల్ సాబ్’ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ పాత్రలో అలరించింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్చి అద్భుతంగా రూపొందించాడు దర్శకుడు వేణు శ్రీరామ్.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు