Home క్రీడలు ‌ఐపీఎల్‌-2021: మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్స్‌ వీరే!

‌ఐపీఎల్‌-2021: మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్స్‌ వీరే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ ఏప్రిల్‌ 9న ముంబై, బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్ తో  ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టాప్ -5 కెప్టెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…

నెంబర్ 1: రోహిత్ శర్మ
ఐపీఎల్ టోర్నీ‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఐపీఎల్ లో ఇప్పటివరకు 116 మ్యాచ్​లకు కెప్టెన్సీ వహించిన రోహిత్ 70 మ్యాచ్​ల్లో విజయాన్నందించాడు. ఇతడి కెప్టెన్సీలో  2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై జట్టు విజేతగా నిలిచింది.
నెంబర్ 2: స్టీవ్‌ స్మిత్ 
ఐపీఎల్ టోర్నీ‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌, రాజస్తాన్‌ రాయల్స్‌‌ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. 2017లో పుణె వారియర్స్​కు ఆడిన సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు  అందుకున్న స్మిత్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్​కూ కొన్ని  సీజన్లలో సారథిగా వ్యవహరించాడు. మొత్తంగా ఐపీఎల్​లో ఇప్పటివరకూ  42 మ్యాచ్​లకు కెప్టెన్ గా వ్యవహరించిన స్మిత్ 25 మ్యాచ్​ల్లో జట్టుకు విజయాన్నందించాడు.
నెంబర్ 3: సచిన్ తెందూల్కర్ 
ఐపీఎల్ టోర్నీ‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో  ముంబయి ఇండియన్స్‌‌ మాజీ కెప్టెన్ సచిన్ తెందూల్కర్  మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ కెప్టెన్సీలోని ముంబై జట్టు 2010 ఐపీఎల్ సీజన్ లో పైనల్స్​కు చేరుకుంది. కానీ హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్​ చేతిలో ఓటమి చవిచూసింది.. మొత్తంగా ఐపీఎల్​లో ఇప్పటివరకూ 51 మ్యాచ్​లకు కెప్టెన్ గా వ్యవహరించిన  సచిన్.. 30 మ్యాచ్​ల్లో జట్టుకు విజయాన్నందించాడు.
నెంబర్ 4: మహేంద్రసింగ్ ధోనీ
ఐపీఎల్ టోర్నీ‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో  చెన్నై సూపర్​ కింగ్స్‌ కెప్టెన్  మహేంద్రసింగ్ ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2008 నుంచి ఇప్పటివరకూ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న  ధోని  ఇప్పటివరకు ఆ జట్టుకు 3 ట్రోఫీలు అందించాడు. మహీ  సారథ్యంలో చెన్నై 2010, 2011, 2018 సీజన్లలో విజేతగా నిలిచింది. మొత్తంగా ఐపీఎల్​లో ఇప్పటివరకు 188 మ్యాచ్​లకు సారథిగా వ్యవహరించిన ధోనీ 110 మ్యాచ్​ల్లో జట్టుకు విజయాన్నందించాడు.
నెంబర్ 5: కామెరూన్ వైట్
ఐపీఎల్ టోర్నీ‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో   డెక్కన్‌ చార్జర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ జట్ల మాజీ కెప్టెన్  కామెరూన్‌ వైట్ ఐదో స్థానంలో ఉన్నాడు.. మొత్తంగా ఐపీఎల్​లో ఇప్పటివరకూ 12 మ్యాచ్​లకు కెప్టెన్ గా వ్యవహరించిన  వైట్​.. 7 మ్యాచ్​ల్లో జట్టుకు విజయాన్నందించాడు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు