Home సినిమాలు హృదయాల్ని మెలిపెడుతున్న వకీల్ సాబ్ ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌

హృదయాల్ని మెలిపెడుతున్న వకీల్ సాబ్ ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఏప్రిల్‌ 9న విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇక సినిమా ప్రమెషన్‌లో భాగంగా సెకండాఫ్‌లో ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. అన్నట్లుగానే సినిమా రెండో భాగంలో ‘మగువా.. మగువా’ పాట.. ఫీమేల్ వర్షన్‌ని సినిమాలో ఉంచారు. తాజాగా ఈ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

‘ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు.. నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు.. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ’ అంటూ సాగే ఈ పాట వీక్షకుల హృదయాలను మెలిపెడుతోంది. ఈ గీతాన్ని మోహన భోగరాజు ఆలపించగా తమన్‌ సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాగా, హిందీలో వచ్చిన ‘పింక్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. అయితే కథలో కొన్ని మార్పులు చేసి ‘వకీల్‌ సాబ్‌’ని తెరకెక్కించారు. ఇందులో ప్రకాశ్‌ రాజ్‌, శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు