Home ప్రత్యేకం హీరో కార్తీ ‘సర్దార్‌' లుక్ సూపర్

హీరో కార్తీ ‘సర్దార్‌’ లుక్ సూపర్

విలక్షణ నటుడు కార్తీ మరో సంచలనంతో దూసుకు రాబోతున్నాడు. కార్తీ నటిస్తున్న
‘సర్దార్‌’ మూవీ ఇప్పుడు తమిళనాట సెన్సేషన్‌గా మారింది. తాజాగా.. ‘సర్దార్‌’ ఫస్ట్ లుక్, టీజర్ యూత్లో కేకరేపుతోంది. ఇందులో పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచాడు కార్తి. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. వీడియో చూస్తుంటే భారత్‌- చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాగా అర్థమవుతుంది.
కాగా, తెలుగులో విశాల్‌తో ‘అభిమన్యుడు’, శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలతో తమిళ్, తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్ధార్  సినిమా రూపొందుతుంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, రాజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు