Home సినిమాలు 'హరిహర వీరమల్లు': మూడు గెటప్స్ లో పవర్ స్టార్.. ఆస‌క్తిక‌ర‌ విష‌యాలు చెప్పిన ప‌వ‌న్‌ స్టైలిష్ట్‌

‘హరిహర వీరమల్లు’: మూడు గెటప్స్ లో పవర్ స్టార్.. ఆస‌క్తిక‌ర‌ విష‌యాలు చెప్పిన ప‌వ‌న్‌ స్టైలిష్ట్‌

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్యద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ బందిపోటు పాత్రలో కనిపిస్తాడని సమాచారం. 

కాగా.. ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాలో పవన్‌ కళ్యాణ్ లుక్స్‌ గురించి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఐశ్వర్యా రాజీవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హరిహర వీరమల్లు పీరియాడిక్‌ డ్రామా. ఈ చిత్రంలో ప‌వన్ క‌ల్యాణ్ 30 కాస్ట్యూమ్స్ వేసుకోనున్నాడు. అంతేకాదు ప‌వ‌న్ 3 డిఫ‌రెంట్ లుక్స్ లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు ట్ర‌య‌ల్స్ చేయ‌గానే కాస్ట్యూమ్స్ అన్నింటికీ ఒకే చెప్ప‌డం నిజంగా థ్రిల్ కు గురించేసింది.” అని ఐశ్వర్యా వివరించారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టుకునే క‌డియం ఇత‌రాత్ర ఆభ‌ర‌ణాలు, వ‌స్ట్రాల‌ను ఐశ్వ‌ర్య అండ్ టీం స్పెష‌ల్‌గా డిజైన్ చేసింది. అలాగే మొఘ‌ల్‌, కుతుబ్‌షాహి కాలం నాటి బ్యాక్ డ్రాప్ కాబట్టి ఇత‌ర న‌టీన‌టులు వేసుకునే కాస్ట్యూమ్‌ రూప‌క‌ల్ప‌న కోసం ఐశ్వ‌ర్య అండ్ టీం భారతదేశంలో ప‌లు ప్రాంతాల‌ను సంద‌ర్శించి..వేయి థాన్లు ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసిన‌ట్టు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు