Home సినిమాలు 'స‌లార్' నుంచి క్రేజీ అప్‏డేట్: ఫస్ట్ షెడ్యూల్ ముగించిన ప్రభాస్

‘స‌లార్’ నుంచి క్రేజీ అప్‏డేట్: ఫస్ట్ షెడ్యూల్ ముగించిన ప్రభాస్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ చిత్రం “సలార్”‌. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తోంది.హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు. దీనితోపాటు ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తైపోయింది. ఈ చిత్రం 2021 వేసవి తర్వాత విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకుడు. ఈ సినిమాతో పాటు.. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇప్పటికే ముంబైలో మొదలైపోయింది. 

కాగా ‘సలార్’ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ఇదిలా ఉంటే సలార్ తొలి షెడ్యూల్ అప్పుడే పూర్తైపోయింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ3 పరిధిలో సలార్ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బొగ్గు గని కార్మికుల నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కాగా,ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అయిపోయినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాగే అక్టోబర్ లోపు ‘సలార్’ చిత్రీకరణ పూర్తి చేస్తామని ప్రకటించాడు ప్రశాంత్ నీల్.కాగా, ఫిబ్రవరి మూడో వారంలో ‘సలార్’ రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు