Home ప్రత్యేకం 'స‌ర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

‘స‌ర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వంలో  రూపొందనున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. తాజాగా సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా బిజినెస్ లెక్కలు బయ్యర్లను భయపెడుతున్నాయి. టాలీవుడ్ ను షేక్ చేస్తోంది..

ఇప్పటి వరకు సగానికి తక్కువగా కూడా షూటింగ్ జరగని సర్కారు వారి పాట అప్పుడే బిజినెస్ పూర్తి చేసుకుంటుండటం ట్రేడ్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ సినిమా 15 కోట్లకు అమ్ముడయినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ప్రాంతంలో 10 కోట్లు అంటేనే ఓ రికార్డు. అలాంటిది సర్కారు వారి పాట సినిమా ఇప్పుడు 15 కోట్లు బిజినెస్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో సర్కారు వారి పాట మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు