Home ప్రత్యేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అయితే ఇప్పుడు ‘పుష్ప’ సినిమా కథ ఇదే అంటూ సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘విలన్’ సినిమా కథని ఆధారంగా తీసుకొని సుకుమార్ ‘పుష్ప’ కథ రాసుకున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్‌కి ఓ చెల్లి పాత్ర ఉంటుందని చిత్రబృందం గతంలోనే ప్రకటించారు. ఆ పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలో పుష్పరాజ్ తన చెల్లెలికి అన్యాయం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన కథాంశంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తునన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు