Home సినిమాలు సూప‌ర్ స్టార్ మహేష్ అరుదైన ఘనత.. కొడితే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

సూప‌ర్ స్టార్ మహేష్ అరుదైన ఘనత.. కొడితే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.  రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా  గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలై మహేశ్‌ బాబు గత సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్ అంటూ సాగే సాంగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ తాజాగా 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టి ఓ అరుదైన రికార్డ్ సాధించింది.

ఇదిలాఉంటే..  భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా  ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై దర్శకుడు అనిల్‌ బాగా ఫోకస్‌ చేయడంతో  బాక్సాఫీస్‌ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్ల వర్షం కురిపించింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు