Home ప్రత్యేకం సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2021కి గాను ర‌జ‌నీకాంత్ అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని కేంద్రప్రభుత్వం తాజాగా ప్ర‌క‌టించింది. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ అందుకోనున్న‌ట్టు కేంద్రం ప్రకటించింది. ఇదిలాఉంటే.. త‌మిళ‌నాడు ఎన్నికలు ఏప్రిల్‌ 6న జ‌ర‌గ‌నుండ‌గా, ఎన్నికల ముంగిట కేంద్ర ప్రభుత్వం రజనీకి ఈ అవార్డ్ ప్ర‌క‌టించ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. ఇక అంతకుముందు ర‌జ‌నీకాంత్ 2000లో ప‌ద్మ‌భూషణ్‌, 2016లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాలు అందుకున్న సంగతి తెలిసిందే.
కాగా, 1969లో ప్రారంభమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవంలో ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. హిందీ పరిశ్రమ నుండి 32 మంది ఈ అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భారతీయ భాష రంగం నుంచి ఈ అవార్డును దక్కించుకున్నారు. కాగా, గతేడాది భారత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న విష‌యం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు