Home సినిమాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. మ‌హేశ్‌-సందీప్‌రెడ్డి కాంబో ఫిక్స్..!

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. మ‌హేశ్‌-సందీప్‌రెడ్డి కాంబో ఫిక్స్..!

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ శరవేగంగా షూటింగ్‌ పనులు జరుపుకుంటోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్‌ తర్వాత మహేశ్‌ ‘సర్కారు వారి పాట’కు సంతకం చేశారు. ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్‌. తమన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. మరోవైపు  మహేష్ బాబు త్వరలో అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా సూపర్ డైరెక్టర్ గా మారిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పనిచేయనున్నారని సమాచారం.

నిజానికి అర్జున్‌రెడ్డి త‌ర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో మ‌హేశ్‌బాబు సినిమా చేస్తున్నాడని గ‌తంలో రూమర్లు కూడా వ‌చ్చాయి. ఈ నేపథ్యంలోనే మ‌హేశ్‌కు సందీప్ రెడ్డి ఓ కథను కూడా వినిపించ‌గా.. త‌న ఇమేజ్‌కు ఆ కథ స‌రిగ్గా సెట్ అవ్వ‌ద‌ని భావించి వెన‌క్కి త‌గ్గిన‌ట్టు వార్తలు వినిపించాయి. అయితే, ఎట్టకేలకు వీరిద్ద‌రి కాంబినేష‌న్ కు ముహూర్తం కుదిరినట్టు ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ ఇద్ద‌రి కాంబినేషన్ లో వ‌చ్చేది సినిమా కాద‌ట‌. ఓ పాపుల‌ర్ బ్రాండ్ కోసం యాడ్ ఫిల్మ్ షూట్ చేయనున్నాడట మ‌హేశ్‌. ఈ యాడ్ ఫిల్మ్‌ను సందీప్‌రెడ్డి డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు