‘రెమో’ సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్. ఆయన తాజాగా హీరో కార్తితో తెరకెక్కించిన చిత్రం ‘సుల్తాన్’. రష్మిక హీరోయిన్ గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యష్.ఆర్.ప్రకాష్‌బాబు, యస్.ఆర్.ప్రభు నిర్మించారు. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఏకాలంలో విడుదలైంది. అయితే టాలీవుడ్లో తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చిప్పటికీ.. చక్కటి కలెక్షన్స్ రాబట్టింది.
‘సుల్తాన్’ సినిమా విడుదలైన తొలి రోజే రూ. 1.20 కోట్ల షేర్ ను రాబట్టి తెలుగులో కార్తీ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఈ సినిమా నైజాంలో 0.42 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 0.10 కోట్లు, వేస్ట్ గోదావరిలో 0.08 కోట్లు, కృష్ణ 0.12 కోట్లు, నెల్లూరులో రూ. 0.06కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక ‘సుల్తాన్’ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే సుల్తాన్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 6.5కోట్ల షేర్ ను వసూలు చేయాలి. ఇక తొలి రోజు ఈ చిత్రం 1.20 కోట్ల షేర్ ను రాబట్టింది కాబట్టి కాబట్టి మరో 5.30 కోట్ల షేర్ ను వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే అని చెప్పొచ్చు.