Home సినిమాలు సుమంత్ 'కపటధారి' మూవీ రివ్యూ:

సుమంత్ ‘కపటధారి’ మూవీ రివ్యూ:

నటీనటులు : సుమంత్‌, నందిత, నాజర్‌, జయప్రకాశ్, వెన్నెల కిషోర్‌ తదితరులునిర్మాతలు : ధనంజయన్‌, లలితా ధనంజయన్‌దర్శకత్వం : ప్రదీప్‌ కృష్ణమూర్తి 

క‌న్న‌డలో ‘కావలుధారి’గా తెరకెక్కి ఘన విజయం సాధించిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం తెలుగులో ‘క‌ప‌ట‌ధారి’గా రీమేక్ అయ్యింది. విభిన్న చిత్రాలు చేసే సుమంత్ హీరోగా న‌టించడం… ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తి రేకెత్తించ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మరి చిత్రం ఎలా ఉంది? పోలీస్‌ ఆఫీసర్‌గా సుమంత్‌ ఎలా నటించాడో ఈ సమీక్షలో చూద్దాం..
కథ:
గౌతమ్‌ (సుమంత్‌) ఒక బాధ్యతగల ట్రాఫిక్‌ ఎస్సై. కానీ ఆ ఉద్యోగంతో అతను సంతృప్తి చెందడు. పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్‌ కేసులను ఛేదించాలని అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా అతనికి ఆ అవకాశం దక్కదు. ఇదిలా ఉంటే.. ఒకరోజు మెట్రో పనుల కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైపైన విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్‌ మాత్రం ఆకేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్‌ గోపాల్‌ కృష్ణ (జయప్రకాశ్), 40 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్‌ చేసిన రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజన్ ‌(నాజర్‌) పరిచయం అవుతారు. కేసు విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తాయి.. ఆ విషయాలు ఏంటి?  తవ్వకాల్లో లభించిన అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? కేసు విచారణలో గౌతమ్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేవి థియేటర్లలో చూడాల్సిందే..
విశ్లేషణ:
ఈ సినిమాలో హీరో సుమంత్ పోలీస్ పాత్ర‌లో చక్కగా నటించాడు. కానీ, ఆ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానంలో లోపాలు క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్ సినిమాల్లో హీరో పాత్రలు బలంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో సుమంత్ పాత్ర‌లో కానీ, అలాంటిది క‌నిపించ‌లేదు. నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ తమ పాత్ర‌లకు న్యాయం చేశారు. హీరోయిన్ పాత్ర‌కి ప్రాధాన్యం లేదు. వెన్నెల కిషోర్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. సాంకేతిక విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. 
ప్లస్ పాయింట్స్ : కథలో ట్విస్టులు, సంగీతం
మైనస్‌ పాయింట్స్ : ‌ఫస్టాఫ్,సాగదీత సీన్లు 
రేటింగ్: 2.5/5

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు