Home సినిమాలు సుదీర్ఘ 'నిరీక్షణ'కు తెర... ఎన్టీఆర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న జాతీయ ఉత్తమ నటి!

సుదీర్ఘ ‘నిరీక్షణ’కు తెర… ఎన్టీఆర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న జాతీయ ఉత్తమ నటి!

దర్శకధీరుడు రాజోమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతుండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రానికి ‘అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే, ఈ సినిమాలో సీనియర్ నటి ‘నిరీక్షణ’ మూవీ ఫేమ్ అర్చన నటించబోతుందట. అర్చన రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ చిత్రాలకు గాను 1988 లో, 1989 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అర్చన అందుకున్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఆమె త్రివిక్రమ్‌-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి అమ్మ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు