Home చదువు సీబీఎస్‌ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..!

సీబీఎస్‌ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..!

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది.  మే 4 నుంచి  జూన్‌ 11 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్నాయి. 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో కొనసాగుతాయి. తొలి షిఫ్ట్‌ ఉదయం 10.30గంటల నుంచి 1.30గంటల వరకు అలాగే రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30గంటల వరకు జరగనున్నాయి.కాగా,ప్రతీ ఏడాది ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరిలో..  రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. కాగా, ఈ ఏడాది బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు