Home సినిమాలు 'సీటీమార్' నుంచి 'పెప్సీ ఆంటీ' సాంగ్ రిలీజ్.. షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

‘సీటీమార్’ నుంచి ‘పెప్సీ ఆంటీ’ సాంగ్ రిలీజ్.. షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ – తమన్నా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’‌. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని పొస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఏపీకి కోచ్‌గా .. తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్ 2న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి జ్వాలా రెడ్డి అన్న సాంగ్ రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సీటీమార్ సినిమా నుంచి ‘ నా పేరే పెప్సీ ఆంటీ’ అనే సాంగ్ విడుద‌ల చేశారు. 

క్రాక్ సినిమాలో ‘భూం బద్దల్’ అన్న సాంగ్‌తో ఓ ఊపు ఊపిన అప్స‌ర రాణి ఇప్పుడు నా పేరే పెప్సీ ఆంటీ అంటూ ‌సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. పాట‌తో పాటు డ్యాన్స్ కూడా మాస్ స్టైల్‌లో ఉండ‌నుండ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన్‌లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు