Home ప్రత్యేకం సినీ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు

సినీ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు

సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు.  గత కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న పొట్టి వీరయ్య వయస్సు 74 సంవత్సరాలు.  పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య.  మొదటి నుంచి నటన పట్ల మక్కువ చూపే పొట్టి వీరయ్య నాటకాలు కూడా వేసేవారు.  ఆ తర్వాత సినిమా నటుడవ్వాలని మద్రాస్ చేరుకున్నారు.  శోభన్ బాబు సలహాతో విఠలాచార్య ను కలవడంతో, విఠలాచార్య అగ్గిదొర చిత్రం లో అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు.  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 500 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.  పొట్టి వీరయ్య మృతి పట్ల సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.

2008 లో పొట్టి వీరయ్య భార్య మృతి చెందారు.  వీరికి ముగ్గురు కుమార్తెలు.  చిన్న కూతురు విజయ దుర్గ కూడా సినిమాలలో రాణించారు.

తన మరుగుజ్జుతనానికి ఏ మాత్రం అధైర్య పడకుండా, దానినే వరం గా మార్చుకుని సినిమాలలో రాణించారు.  పొట్టి వీరయ్య నుంచి నేటి తరం స్ఫూర్తి పొందవచ్చు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు