Home సినిమాలు సిద్‌ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా?

సిద్‌ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా?

ప్ర‌స్తుతం తెలుగు చిత్రసీమలో సింగ‌ర్ సిద్ శ్రీరామ్ జోరు కొన‌సాగుతోంది. ఆయ‌న పాడిన పాట‌లన్నీ సూప‌ర్ హిట్ అవుతుండ‌టంతో సిద్ శ్రీరామ్‌తో ఒక్క పాటైనా పాడించాల‌ని దర్శకులు కోరుకుంటున్నారు. యూత్‌లోనూ ఈయనకి  మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో  సిద్‌ శ్రీరామ్‌ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు విడుదల కావ‌ట్లేద‌న‌డంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే, ఈ మధ్య కాలంలో సిద్ శ్రీరామ్ తెలుగులో పాడిన ప్రతి పాట సెన్సేషనే. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తరవాత ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ మరో సెన్సేషన్ అయ్యింది. అలాగే, ‘వకీల్ సాబ్’లోని ‘మగువా మగువా’, రీసెంట్‌గా ‘శశి’ సినిమాలో ‘ఓకే ఒక లోకం’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే, తాజాగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యంలో ‘రంగ్ దే’ సినిమా కోసం ‘నా కనులు ఎపుడు’ అనే పాటను పాడారు.

మరి ఇంత క్రేజ్‌ ఉన్న సిద్‌ శ్రీరామ్‌ తీసుకునే రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. సాధారణంగా సింగర్‌ను బట్టి 20 వేల నుంచి 50 వేలు, పెద్ద సింగర్ అయితే 1.5లక్షల దాకా పారితోషికం ఇస్తారట. అయితే సిద్‌ శ్రీరామ్‌కున్న మార్కెట్‌ను బట్టి ఆయనకు 4.5లక్షలు ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఒక్క పాటకే ఆయన ఇంత మొత్తంలో అందుకోవడం విశేషం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు