Home సినిమాలు సిక్కింలో ఎంజాయ్‌ చేస్తున్న చిరంజీవి, మోహన్‌బాబు.. వైరల్‌గా మారిన ఫోటో

సిక్కింలో ఎంజాయ్‌ చేస్తున్న చిరంజీవి, మోహన్‌బాబు.. వైరల్‌గా మారిన ఫోటో

టాలీవుడ్‌ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. అటు సినిమాలతో ఇటు వ్యాపారులతో ఎప్పుడు బిజీగా ఉండే వీరిద్దరూ ఇటీవల సిక్కింకు వీకెండ్‌ ట్రిప్‌ వెళ్లారు. ఈ విషయాన్ని మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్మి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో చిరు, మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. “ఇద్దరు దిగ్గజాలు సిక్కిం ట్రిప్‌కు వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి అంకుల్‌ వీకెండ్‌ ట్రిప్‌కు నాన్నను దగ్గరుండి ఒప్పించి మరీ తీసుకెళ్లాడు. నాకెంతో అసూయగా ఉంది. వీకెండ్స్ లో మీ ఇద్దరూ ఇలా కొంతసమయాన్ని గడపడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏదో ఒకరోజు పిల్లలందరం మీతో కలిసి వస్తాం’’ అని ఆమె పేర్కొన్నారు. 

అయితే, ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి ఇలా వీకెండ్ ట్రిప్ వేయడం వారి వారి అభిమానుల్లో ఆనందం నింపుతోంది. ఇదిలావుంటే.. చిరంజీవి-మోహన్‌బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘కిరాయి రౌడీలు’ వంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయాన్ని అందుకున్నాయి. మరోవైపు  చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’లో కుమారుడు రామ్‌చరణ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీకొడుకుల సరసన కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా మే 13న రిలీజ్‌ కానుంది. ఇక మోహన్‌బాబు  ‘సన్నాఫ్‌ ఇండియా’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ పతాకం‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు